డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?

By | November 7, 2019

ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ జాబుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఏలా నేర్చుకోవాలి?  ఇంటెర్నెట్ లొ  నేర్చుకోవాలా? లేదా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకోవాలా? అసలు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవొచ్చా ? డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా వున్నాయి?  ఇలా అనేక ప్రశ్నలు మనకు వస్తుంటాయి, ఈ పోస్ట్ ద్వారా మీ ప్రశ్నల్ని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను . పోస్ట్ ను చివరి వరకు చదవండి

ముందుగా మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం

ఒక కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి వినియోగదారుడికి తెలియజేయడం.  దిన పత్రికల్లో ఇచ్చే యాడ్స్ , టీవీ యాడ్స్, రేడియో యాడ్స్, బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్, ఇలా మొదలైన వాటి ద్వారా కంపెనీలు మార్కెటింగ్ చేస్తాయి . ప్రజలు టీవీ చూస్తున్నారు కాబట్టి టీవీ లో యాడ్స్ ఇస్తున్నారు.  కానీ, ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు తమ సమయాన్ని ఇంటర్నెట్ లో గడుపుతున్నారు.

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?

సింపుల్ గ చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్.

డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి ?

ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి అంటే, ఒక సొంత బ్లాగ్ ని తయారు చేసి డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలు బ్లాగ్ పై ప్రయోగించి నేర్చుకోవడం. దీని కోసం ఒక వెబ్ సైట్ పేరు కొనుక్కొని హోస్టింగ్ కొనుక్కుంటే చాలు. 700 రూపాయలతో ఒక మంచి బ్లాగ్ ను తయారు చేసుకోవొచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి ?

ఇంటర్నెట్ లో

డిజిటల్ మార్కెటింగ్ పై  ఇంటర్నెట్ లో చాలా కోర్స్ లు ఉన్నాయ్. విదేశీ మరియు స్వదేశీ యూనివర్సిటీలు మరియు కాలేజీలు సైతం ఈ కోర్స్ ను ఇంటర్నెట్ ద్వారా అందిస్తున్నాయి. కాకపొతే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఫ్రీ కోర్స్ లు కూడా వున్నాయి కానీ అవి అరకొర సిలబస్ తో వున్నాయి.  తక్కువ ఖర్చుతో నాణ్యమైన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ను అందిస్తున్న వెబ్ సైట్ ల వివరాలు త్వరలో మీకు అందిస్తాను.

Learn Digital Marketing in Telugu

క్లాస్ రూమ్ ట్రైనింగ్

కొన్ని ఇన్స్టిట్యూట్ లు ఆన్లైన్ మరియు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ను అందిస్తున్నాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ , ప్రస్తుతం ఈ రెండు ఖర్చుతో కూడుకున్నవే అని చెప్పాలి. ఎందుకంటే, వీరు ఎంత లేదనుకున్న, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసం 30000 రూపాయల నుండి 70000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అన్ని ఫీజు లపై 18% జి ఎస్ టి ఉంటుందని మర్చిపోకండి. డబ్బు సమస్య కాదనుకుంటే మంచి ఇన్స్టిట్యూట్ లో చేరి కోర్స్ నేర్చుకోవడం మంచిదే. ఇన్స్టిట్యూట్ ను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త.

నేను డిజిటల్ మార్కెటింగ్ ను నేర్చుకోవొచ్చా?

ఖచ్చితంగా నేర్చుకోవొచ్చు. మార్కెటింగ్ మరియు కాస్త ఐటీ స్కిల్స్ ఉంటే చాలు. అవి లేకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూనే కూడా నేర్చుకొవొచ్చు. మీకు ఒక మంచి మెంటర్ ఉంటే వేగంగా మరియు సులువుగా నేర్చుకోవొచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు

డిజిటల్ మార్కెటింగ్ రంగానికి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటర్స్ కి ఎప్పుడు లేనంత డిమాండ్ ఉంది. నిరుద్యోగులను ప్రస్తుతం ఈ రంగం ఆకర్షింస్తుందనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇటీవలే డిజిటల్ మార్కెటర్స్ కు ఉండే డిమాండ్ పై టైమ్స్ అఫ్ ఇండియా లో ఒక బ్లాగ్ ని ప్రచురించారు. వీలయితే చదవండి.

Digital John Newsletter

Please wait....

Thank you for signing up for my updates!

Telugu Digital Marketing Articles

డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?

డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ఎందుకు నేర్చుకోవాలి?

నేను బ్లాగింగ్ ఏ టాపిక్‌పై చేస్తే బాగుంటుంది?